ప్రార్థన అంశములు (Prayer Points) తగరపువలస 1. తగరపువలస,సంఘానికి కావలసిన రెండంతస్తుల చర్చి భవనం కట్టుటకు ఆర్థిక సహాయం అందించి, పనులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యి, దానిలో 24 గంటలు దేవునికి విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు జరుగునట్లుగా దేవుడు కృప చూపునట్లుగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. 2. సంఘకార్యక్రమాలకు, సంఘం ఉజ్జీవంగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో కార్యములుజరిగిస్తూ, దేవుని ఆత్మకు వ్యతిరేకమైన వాటిని దూరపరుస్తూ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్య, అద్భుతకార్యలు జరిగిస్తూ అనేకమంది ఆత్మలను రక్షణలోకి నడిపిస్తూ దేవుని రాకడకై ఆత్మలను సిద్ధపరచులాగున దేవునికి స్తుతి చెల్లిద్దాం. 3. సంఘానికి కావలసిన నమ్మకస్తులైన సహాయకులను, పాటలు పాడేవారిని, మ్యూజిక్ వాయించేవారిని, 24 గంటలు విజ్ఞాపన ప్రార్థనలు చేయువారిని, వాహనం నడుపువారిని మొదలగు అన్ని కార్యక్రమాలకు సహకరించే నమ్మకస్తులైన, బాధ్యతగల వారిని ప్రభువు అనుగ్రహించునందుకు దేవునికి స్తుతి చెల్లిద్దాం. 4. రక్షింపబడిన ఆత్మలను సిద్ధపరచునట్లుగా, రక్షింపబడవలసిన ఆత్మలను ప్రభువు రాకడకు ముందుగా, త్వరగా రక్షించునట్లుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. 5. సంఘములో ఇంకా ఉజ్జీవం వచ్చి, అందరూ ఏకాత్మ, ఏక భావము, ఏకహృదయము కలిగి, దేవుని ద్వారా సంఘానికి చేస్తానని పలికిన అన్ని వాగ్దానములు త్వరగా నెరవేరునట్లుగా ప్రభువుకు స్తుతి చెల్లిద్దాం. 6. ప్రపంచమంతటా ఉండే నిజమైన దేవుని సేవకులను, వారి పరిచర్యలను, విశ్వాసులను, వారి కుటుంబాలను ఆశీర్వదించి ఆయన రాకడకు సిద్ధపరచునట్లుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. 7. ఇశ్రాయేలు ప్రజలపట్ల ప్రభువు చిత్తం నెరవేర్చి, ఇశ్రాయేలీయులకు ప్రభువు చేసిన వాగ్దానాలు పూర్తిగా, త్వరగా నెరవేరునట్లుగాను, వారిని ఆశీర్వదించి, యెరూషలేము పట్టణాన్ని కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 8. ప్రపంచమంతటా ఉండే ప్రజలకు ప్రభువు రక్షణ సువార్త ప్రకటింపబడి, ఆయన రాకడకు ముందుగా రక్షింపబడవలసిన వారినందరినీ రక్షించి, సిద్ధపరచునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 9. ప్రపంచమంతటా ఉండే రోగులను, అనాధలను, కొన్ని అవయవాలు సరిగా పనిచేయని వారిని, మతిస్థిమితం లేనివారిని, విడువబడిన వారిని, వెలివేయబడిన వారిని, దిక్కులేని వారిని, జైళ్లలో మగ్గుతున్న వారిని, వ్యసనాలకు బానిసలైనవారిని, దరిద్రులను ప్రభువు జ్ఞాపకం చేసుకుని వారికందరికి కావలసిన సహాయమును, కృపను, కనికరమును ప్రభువు చూపునట్లుగాను, భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారిని స్వస్థపరచి, రక్షించునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 10. జీవముగల దేవుని సంఘానికి వస్తున్న వారందరినీ, వారి కుటుంబాలను, వారి బంధు మిత్రులను ప్రభువు రక్షించి, ప్రతిఒక్కరిని ప్రభువు ఆశీర్వదించి, అభివృద్ధి పరచి సిద్ధపరచునట్లుగాను మరియు దేవుని చిత్తం, వాగ్దానాలు నెరవేరునట్లుగాను, వారి రాకపోకల యందు కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 11. జీవముగల దేవుని సంఘానికి వస్తున్నవారిలో, చిన్నపిల్లలకు జ్ఞానము, బుద్ధి, ఆయుష్షు ఆరోగ్యము ఇచ్చునట్లుగాను, యవ్వనస్థులు తొట్రుపోకుండా ప్రభువులో నిలిచి, వారు అడుగుచున్న ప్రార్థనలకు జవాబులు పొందునట్లుగాను, స్త్రీలు, పురుషులు, వారి కుటుంబాల నిమిత్తం చేస్తున్న ప్రార్థనలకు జవాబులు వచ్చునట్లుగాను, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆయుష్షు ఆరోగ్యము ప్రభువు ఇచ్చునట్లుగాను, సంతానం లేనివారికి సంతానం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, దేవుని సేవ చేయాలనుకునే వారి పట్ల దేవుని చిత్తం నెరవేరునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 12. దైవజనులైన పెద్దయ్యగారిని, పెద్దమ్మగారిని ఆశీర్వదించి, వారికి మంచి ఆరోగ్యమును, ఆయుష్షును ఇచ్చి వారి ప్రార్థనలకు జవాబులు ఇచ్చి, దేవుని చిత్తం వారి పట్ల నెరవేరునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 13. దైవజనులైన మన పాస్టర్ (ఆంథోనీ) గారిని, పాస్టరమ్మ (రూతు) గారిని, దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం బలంగా వాడుకొనునట్లుగాను, ప్రభువు చిత్తం వారి పట్ల నెరవేరునట్లుగాను మరియు ప్రభువు వారితో పలికిన వాగ్దానములన్నియు త్వరగా నెరవేరునట్లుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. 14. వారి రాకపోకలయందు ప్రభువు వారిని కాపాడునట్లుగాను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, వారికిచ్చిన పాప (రీమా) ను కూడా అన్ని విధాలుగా ఆశీర్వదించి, ఆత్మతో నడిపించినందుకు దేవునికి స్తుతి చెల్లిద్దాం. 15. దైవ సేవకులైన ఆంథోనీ గారి అక్క గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దేవుని చిత్తప్రకారం నడిపించి, ఆశీర్వదించునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 16. పాస్టరమ్మ (రూతు) గారి సహోదరి అయిన దైవ సేవకురాలైన సిస్టర్. ఎస్తేర్ రాణి గారిని, దానియేలు సురేష్ గారిని ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, వారి పట్ల, వారి సంఘం పట్ల దేవుడు తన యొక్క చిత్తమును, వాగ్దానాలను నెరవేర్చి, దేవుని సేవలో బలంగా వారిని వాడుకొనునట్లుగాను, వారి రాకపోకలయందు ప్రభువు వారిని కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 17. పాస్టరమ్మ (రూతు) గారి సహోదరులైన దైవ సేవకులైన బ్రదర్. స్టీఫెన్ పాల్ గారిని, శైలజగారిని, వారి పిల్లలను ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, వారి పట్ల, వారికిచ్చిన సంఘం పట్ల దేవుని యొక్క చిత్తమును, వాగ్దానాలను నెరవేర్చి, దేవుని సేవలో బలంగా వారిని వాడుకొనునట్లుగాను, వారి రాకపోకలయందు ప్రభువు వారిని కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 18. పాస్టరమ్మ (రూతు) గారి సహోదరులైన బ్రదర్. రాజ్ కుమార్ గారిని, వారికిచ్చిన కుటుంబాన్ని ప్రభువు సేవలోనికి నడిపించి, వారి పట్ల దేవుని చిత్తం, వాగ్దానాలు నెరవేర్చి వారిని ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, వారి రాకపోకలయందు ప్రభువు వారిని కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం. 19. జీవము గల దేవుని సంఘంలో దేవుని పరిచర్యకు, దేవుని సేవకులకు సహకరిస్తూ, సహాయం చేస్తున్న వారి కుటుంబాలను ఆశీర్వదించి, అభివృద్ధిపరచి, వారి రాకపోకలయందు ప్రభువు వారిని కాపాడునట్లుగాను దేవునికి స్తుతి చెల్లిద్దాం.