ఆరాధ నీయుడా నా చాలిన దేవుడా (2)
దివా రాత్రులు నీ నామస్మరణ చేసినా నా కెంతోమేలు
స్తోత్రము స్తుతి స్తోత్రము – స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
దూతలు నిత్యము స్తుతియింపగా- నాలుగు జీవులు కీర్తింపగా (2)
స్తుతుల మధ్యలో నివసించు దేవా నాస్తుతి గీతము నీకే ప్రభువా
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)
సిలువలో మాకై మరణించినా – పరిశుద్ధ రక్తము చిందించినా (2)
వధింప బడినా ఓ గొర్రెపిల్ల – యుగ,యుగములు నీకే మహిమ(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము,స్తోత్రము స్తుతి స్తోత్రము (2)