COLG Songs

No songs found.

Song 289

యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం

Yehova naa balamaa Yadarthamainadi nee maargam

యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ॥2॥ ॥యెహోవా॥
నా శత్రువులు ననుచుట్టినను - నరకపు పాశములరికట్టినను ॥2॥ వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువక-నను ఎడబాయని దేవా ॥2॥ ॥యెహోవా॥
మరణపు టురులలో, మరువక మోరలిడ, ఉన్నత దుర్గమై, రక్షణ శృంగమై ॥2॥ తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయంకంపముచే ॥2॥ ॥యెహోవా॥
నా దీపమును వెలిగించు వాడు, నా చీకటిని వెలుగుగ చేయును ॥2॥ జలరాశుల నుండి బలమైన చేతితో ॥2॥ వెలుపల జేర్చిన బలమైనదేవా ॥2॥ ॥యెహోవా॥
దయగలవారిపై దయ చూపించును - కరినుల యెడల వికటము చూపును ॥2॥ గర్విష్టుల యొక్క గర్వము అణుచును సర్వము నెరిగిన సర్వాధికారి ॥2॥ ॥యెహోవా॥
నా కాళ్ళను లేడి కాళ్ళుగా జేయును ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి ॥2॥ రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము జేర్చిన ॥2॥ ॥యెహోవా॥
పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులువణకెను తన నోట నుండి వచ్చిన యగ్ని దహించి వేసెను వైరులనెల్ల ॥యెహోవా॥
మేఘములఫై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుములు మెరుపులు మెండుగజేసి అపజయమిచ్చును అపవాదికిని ॥యెహోవా॥
యెహోవా జీవముగల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్య జనులలో ధన్యత చూపుచు హల్లెలూయ స్తుతి గానము చేసేద ॥యెహోవా॥
English lyrics (transliteration)
Yehova naa balamaa - Yadarthamainadi nee maargam Paripoornamainadi nee maargam ||2|| ||Yehova||
Naa shatruvulu nanu chuttinanu - Narakapu paashamularikattinanu ||2|| Varadavale bhaktiheenulu porlina - Viduvaka nanu edabaayani devaa ||2|| ||Yehova||
Maranapu turulalo, maruvaka moralida - Unnata durgamai, rakshana shringamai ||2|| Tana aalayamalo naa mora vinenu - Adarenu dharani bhaya-kampamuche ||2|| ||Yehova||
Naa deepamunu veliginchu vaadu - Naa cheekatini veluguga cheyunu ||2|| Jalarashula nundi balamaina chetito ||2|| Velupala jerchina balamainadevudu ||2|| ||Yehova||
Dayagalavaaripai daya chupinchunu - Kathinula yedala vikatamu chupunu ||2|| Garvishtula yokka garvamu anuchunu - Sarvamu nerigina sarvaadhikaari ||2|| ||Yehova||
Naa kaallanu ledi kaalluga jeyunu - Ettaina sthalamulo shaktito nilipi ||2|| Rakshana kedemu naakandinchi - Akshayamuga tana pakshamu jerchina ||2|| ||Yehova||
Paurushamu gala prabhu kopimpaga - Parvatamula punaaduluvanakenu Tana nota nundi vacchina yagni - Dahinchi vesenu vairulanella ||Yehova||
Meghamulapai aayana vacchunu - Meghamulanu tana maatuga jeyunu Urumulu merupulu mendugajeshi - Apajayamichunu apavaadikini ||Yehova||
Yehova jeevamugala devaa - Bahuga stutulaku arhuda neeve Anya janulalo dhanyata chupuchu - Hallelooya stuti gaanamu cheseda ||Yehova||
235 / 303