COLG Songs

No songs found.

Song 78

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము

Innellu ilalo unnamu manamu

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం ॥ఇన్నేళ్లు॥
లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం ॥2॥ పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్య జీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచెలే రక్షణ భాగ్యం ॥ఇన్నేళ్లు॥
మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం ॥2॥ నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించులే నిన్ను కలకాలం ॥ఇన్నేళ్లు॥
English lyrics (transliteration)
Innellu ilalo unnamu manamu Challani devuni needalo Gathinchipoye kaalam – Smarinchu Yesu naamam Santhoshinchu ee navodayam ||Innellu||
Lokame natanaalayam Jeevithame rangula valayam ||2|| Paralokame manaku shaashvatham paraloka devude nithya jeevam Premaamayude aa paramaathmude padilaparachele rakshana bhaagyam ||Innellu||
Maaru manassu manishiki maargam Pashchaathaapam manasuku moksham ||2|| Nee poorna hrudayamutho mokarillumaa nee poorna aathmatho praardhinchumaa Paripoornude parishuddhaathmude karunchule ninnu kalakaalam ||Innellu||
39 / 303