COLG Songs

No songs found.

Song 253

సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్య

Siluvalo naaku badulugaa nee praanamichhaavu Yesayya

సిలువలో నాకు బదులుగా నీ ప్రాణమిచ్చావు యేసయ్య నా పాప శాపమంతయు నీవే భరించినావు యేసయ్య ॥2॥ ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా నీ త్యాగం నేనెప్పుడూ మరువలేనయ్యా ॥2॥ ॥సిలువలో॥
ఈ నేరము చేయని నీవు నా పాపములకై బలి అయినావు ॥2॥ కోరడాలతో కొట్టిన ఉమ్మి వేసిన ముళ్ళతో గుచ్చినా బల్లెంతో పొడిచిన ॥2॥ నా కోసమే భరించినావు నీ ప్రాణమే అర్పించినావు నన్ను నీ రక్తముతో కడిగి పరిశుద్ధుని చేసావు ॥ఏమిచ్చి నీ రుణం॥
నిర్దోషివైన నీవు నా దోషములకై శిక్షణొందినావు ॥2॥ రాళ్లతో కొట్టిన వేదనలు పెట్టిన హేళనే చేసినా అవమానపరిచిన ॥2॥ నా కోసమే భరించినావు నీ ప్రాణమే అర్పించినావు నన్ను నీ వారసునిగా మలచి ఇలపై నను నిలిపావు ॥ఏమిచ్చి నీ రుణం॥
English lyrics (transliteration)
Siluvalo naaku badulugaa nee praanamichhaavu Yesayya Naa paapa shaapamanthayu neeve bharinchinaavu Yesayya (2) Eamichhi nee runam theergalanayyaa Nee thyaagam neneppuduu maruvalenayyaa (2) ||Siluvalo||
Ea neramu cheyani neevu naa paapamulakai bali ayinaavu (2) Koradaalatho kottina ummi vesina mullyatho guchina ballematho podichina (2) Naa kosaame bharinchinaavu nee praaname arpinchinaavu Nannu nee rakthamutho kadigi parishuddhuni chesaavu ||Eamichhi nee runam||
Nirdoshivaina neevu naa doshamulakai shikshanondinaavu (2) Raallatho kottina vedanalu pettina helana chesina avamaanaparichina (2) Naa kosaame bharinchinaavu nee praaname arpinchinaavu Nannu nee vaarasunigaa malachi ilapai nanu nilipaavu ||Eamichhi nee runam||
283 / 303