COLG Songs

No songs found.

Song 27

అర్హత లేకున్న ప్రేమించావు

Arhata Lekunna Preminchavu

[పల్లవి] అర్హత లేకున్న ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్న హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే (2)
[అనుపల్లవి] కృపయే… కృపయే… నేనేమైయున్నానో నీ కృపయే కృపయే… కృపయే… నేబ్రతికి ఉన్నానంటే కృపయే (2)
[1వ చరణం] లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే (2) ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
[2వ చరణం] శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే (2) ఇంతగనన్ను ప్రేమించుటకు ఏ పాటిడను యేసయ్య (2) నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
English lyrics (transliteration)
[Pallavi] Arhata lekunna preminchaavu Idi kevalam nee krupaye Yogyata lekunna hechchinchaavu Idi kevalam nee krupaye (2)
[Anupallavi] Krupaye... Krupaye... Nenemai yunnaano nee krupaye Krupaye... Krupaye... Ne bratiki unnaanante krupaye (2)
[1st Charanam] Lokamunannu aakarshimpagaa Allaritanamu naa chuttu cheragaa Otami naa bratukunu helana cheyagaa Nee krupatho nannu balaparachitive (2) Inthagaa nannu hechchinchutaku Ee paativaadanu Yesayya (2) Nee krupaku ellappudu krutagnudanu (2)
[2nd Charanam] Shramalu shodhanalu nannaavarimpagaa Ajnanamuche ne heenamavvagaa Maranapu koralu naa chuttu cheragaa Nee krupatho nannu brathikinchitive (2) Inthagaa nannu preminchutaku Ee paativaadanu Yesayya (2) Nee krupaku ellappudu krutagnudanu (2)
11 / 303