COLG Songs

No songs found.

Song 26

అపరాధిని యేసయ్యా

Aparaadhini Yesayyaa

అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2)
సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2)
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2)
ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2) నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2)
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2) ద్రోహుండనై జేసితినీ దేహంబు గాయంబులను (2)
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2) అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా (2)
English lyrics (transliteration)
Aparaadhini Yesayyaa Krupa Joopi Brovumayyaa (2) Nepamenchakaye Nee Krupalo Naparaadhamulanu Kshaminchu (2)
Siluvaku Ninu Ne Gotti Thuluvalatho Jerithini (2) Kalushambulanu Mopithini Doshnda Nenu Prabhuvaa (2)
Prakkalo Ballepu Potu Grakkuna Podichithi Nene (2) Mikkili Baadhinchithini Makkuva Joopithivayyo (2)
Mullatho Kireetambu Nalli Nee Shiramuna Nidithi (2) Naa Valla Neramaaye Challani Dayagala Thandri (2)
Daahambu Gonagaa Chedu Chirakanu Draava Nidithi (2) Drohundanai Jesithini Dehambu Gaayambulanu (2)
Ghormabugaa Doorithini Nerambulanu Jesithini (2) Kroorundanai Gottithini Ghorampu Paapini Devaa (2)
Chindithi Rakthamu Naakai Pondina Debbala Chetha (2) Apanindalu Mopithinayyo Sandehamelanayyaa (2)
Shikshaku Paathrudanayyaa Rakshana Dechchithivayyaa (2) Akshaya Bhaagyamu Niyya Mokshambu Joopithivayyaa (2)
10 / 303