COLG Songs

No songs found.

Song 30

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

Athi Parishuddhudaa Sthuthi Naivedyamu

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును (2) నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా ||అతిపరిశుద్ధుడా||
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2) ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2) నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి (2) ||అతిపరిశుద్ధుడా||
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2) కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా (2) నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2) ||అతిపరిశుద్ధుడా||
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2) ఉన్నావులే ప్రతిక్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగున (2) నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి (2) ||అతిపరిశుద్ధుడా||
English lyrics (transliteration)
Athi Parishuddhudaa Sthuthi Naivedyamu Neeke Arpinchi Keerthinthunu (2) Neevu Naa Pakshamai Nanu Deevinchagaa Neevu Naa Thoduvai Nanu Nadipinchagaa Jeevinthunu Nee Kosame – Aashrayamaina Naa Yesayyaa ||Athi Parishuddhudaa||
Sarvonnathamaina Sthalamulayandu Nee Mahima Vivarimpagaa Unnathamaina Nee Sankalpamu Ennadu Aascharyame (2) Mundenndadu Chavichoodani Sarikrothadaina Premaamrutham (2) Neelone Dachaavu Eenaatikai Nee Runam Theeradu Enaatiki (2) ||Athi Parishuddhudaa||
Sadgunaraashi Nee Jaadalanu Naa Yeduta Nunchukoni Gadichina Kaalam Saagina Payanam Nee Krupaku Sankethame (2) Krupa Vembadi Krupa Pondagaa Maaraanu Madhuramugaa Nee Pondagaa (2) Naalona Ye Manchi Choosaavayyaa Nee Prema Choopithivi Naa Yesayyaa (2) ||Athi Parishuddhudaa||
Saarepainunna Paathraga Nannu Chejaariponivvaka Shodhanalennno Edirinchinanu Nanu Soliponivvaka (2) Unnaavule Prathikshanamunaa Kalisunnaavule Prathi Aduguna (2) Neevegaa Yesayyaa Naa Oopiri Neevegaa Yesayyaa Naa Kaapari (2) ||Athi Parishuddhudaa||
5 / 303