COLG Songs

No songs found.

Song 50

ఎడబాయని నీ కృప

Edabaayani Nee Krupa

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని||
విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
English lyrics (transliteration)
Edabaayani Nee Krupa Nanu Viduvadu Ennatiki (2) Yesayyaa Nee Premaanuraagam Nanu Kaayunu Anukshanam (2) ||Edabaayani||
Shokapu Loyalalo – Kashtaala Kadagandlalo Kadaleni Kadalilo – Niraasha Nispruhalo (2) Ardhame Kaani Ee Jeevitham Ika Vyardhamani Nenanukonagaa (2) Krupaa Kanikaramugala Devaa Naa Kashtaala Kadalini Daatinchithivi (2) ||Edabaayani||
Vishwaasa Poraatamulo – Eduraaye Shodhanalu Lokaashala Alajadilo – Sadalithi Vishwaasamulo (2) Dushtula Kshemamune Choochi Ika Neethi Vyardhamani Anukonagaa (2) Deerghashaanthamugala Devaa Naa Cheyi Viduvaka Nadipinchithivi (2) ||Edabaayani||
Nee Sevalo Eduraina – Enno Samasyalalo Naa Balamunu Choochukoni – Niraasha Chendithini (2) Bhaaramaina Ee Sevanu Ika Cheyalenani Anukonagaa (2) Pradhaana Yaajakudaa Yesu Nee Anubhavaalatho Balaparachithivi (2) ||Edabaayani||
50 / 303