COLG Songs

No songs found.

Song 54

ఎందుకో నన్నింతగా నీవు

Enduko Nanninthagaa Neevu

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నరరూపివైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించుమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2) ||ఎందుకో||
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
English lyrics (transliteration)
Enduko Nanninthagaa Neevu Preminchithivo Devaa Anduko Naa Deena Stuthi Paathra Hallelooya Yesayyaa (2)
Naa Paapamu Baapa Nara Roopivainaavu Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi Naaku Chaalina Devudavu Neeve Naa Sthaanamulo Neeve (2) ||Enduko||
Nee Roopamu Naalo Nirminchiyunnaavu Nee Polikalone Nivasinchumannaavu Neevu Nannu Ennukontivi Nee Korakaki Nee Krupalo (2) ||Enduko||
Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu Nannu Neelo Choochukunnaavu Nanu Daachiyunnaavu (2) ||Enduko||
Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo Neevu Nenu Ekamaguvaraku Nannu Viduvanantive (2) ||Enduko||
Naa Manavulu Munde Nee Manasulo Neravere Naa Manugada Munde Nee Granthamulonunde Emi Adbhutha Prema Sankalpam Nenemi Chellinthun (2) ||Enduko||
49 / 303