COLG Songs

No songs found.

Song 39

దేవా దృష్టించు మా దేశం

Deva drushtinchu maa desam

దేవా దృష్టించు మా దేశం – నశించువారిని బాగు చేయుము ॥2॥ పాపము క్షమియించి స్వస్థపరచుము – శాపము తొలగించి దీవించుము ॥2॥ ॥దేవా॥
తుఫానులెన్నో మాపై మొత్తగా – వరదలెన్నో ముంచివేయగా పంటలన్నీ పాడై పోయే – కఠిన కరువు ఆసన్నమాయే దేశపు నిధులే ఖాళీ ఆయే ॥2॥ పేదరికము – మా చెంత చేరువాయే (నాట్యము చేయుచుండే) ॥దేవా॥
దేశాధికారులను దీవించుము – తగిన జ్ఞానము వారికియ్యుము స్వార్థము నుండి దూరపరచుము – మంచి ఆలోచనలు వారికియ్యుము మంచి సహకారములను దయచేయుము దేవా ॥2॥ నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి ॥దేవా॥
మతము అంటు కలహాలే రేగగా – నీది నాదని భేదము చూపగా నీ మార్గములో ప్రేమ నిండియుందని – ఈ దేశమునకు క్షేమము ఇచ్చునని క్రైస్తవ్యము ఒక మతము కాదని ॥2॥ రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి ॥దేవా॥
English lyrics (transliteration)
Deva drushtinchu maa desam – Nasinchuvaarini baagu cheyumu ||2|| Paapamu kshamiyinchi svasthaparachumu – Shaapamu tolaginchi deevinchumu ||2|| ||Deva||
Tuphaanulenno maapai motthagaa – Varadalenno munchiveyagaa Pantalanni paadai poyee – Kathina karuvu aasannamaaye Deshapu nidhule khaalee aaye ||2|| Peedarikamu – maa chenta cheruvaaye (Naatyamu cheyuchunde) ||Deva||
Deshaadhikaarulanu deevinchumu – Tagina gnaanamu vaarikeyumu Svaardhamu nundi dooraparachumu – Manchi aalochanalu vaarikeyumu Manchi sahakaarulanu dayacheyumu deva ||2|| Neeti nyaayamulu vaarilo pettumu thandri ||Deva||
Mathamu antu kalahale regagaa – Needi naadani bhedamu chupagaa Nee maargamulo prema nindiyundani – Ee deshamunaku kshemamu ischunani Kraistavyamu oka mathamu kaadani ||2|| Rakshana maargamani janulaku telupumu thandri ||Deva||
121 / 303