COLG Songs

No songs found.

Song 39

దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై

Devara Nee Deevenalu Dhaaraalamuganu Veeralapai

దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2)
దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||
ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ||దేవర నీ||
ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ ||దేవర నీ||
తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును ||దేవర నీ||
సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ ||దేవర నీ||
మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే ||దేవర నీ||
యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర నీ||
వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్ ||దేవర నీ||
English lyrics (transliteration)
Devara Nee Deevenalu Dhaaraalamuganu Veeralapai Baaguga Vegame Diganimmu Paavana Yesuni Dvaaraganu (2)
Dampathulu Dandiga Nee Dhaathrilo Velayuchu Sampadalan Sompuga Nimpuga Pempaguchu Sahimpuna Veeru Sukhinchutakai ||Devara Nee||
Ee Kavanu Nee Karunan Aakaru Varakunu Lokamulo Shokamu Lekaye Ekamugaa Braakatamuganu Jekonumu ||Devara Nee||
Ippagidi Neppudunu Goppagu Prematho Noppuchu Daa Moppina Choppuna Dappakanu Meppuga Brathukaga Bampu Krupan ||Devara Nee||
Thaapamulu Paapamulu Mopuga Veeripai Raakundagaa Gaapuga Braapuga Daapunundi Yaapadalanniyu Baapuchunu ||Devara Nee||
Saadhulugan Jeyutakai Shodhanalache Neevu Shodhinpagaa Kadalaka Vadalaka Mudamuna Nee Paadamu Daapuna Baadukonan ||Devara Nee||
Menduga Bhoomandalapu Gandamulalo Veerundaganu Thandriga Dandiga Nandanundi Vendiyu Vaanini Khandinchave ||Devara Nee||
Iddara Veeriddarunu Shudhdhulai Ninnu Sevinchutakai Shradhdhatho Budhdhiga Sidhdhapadan Didhdhumu Nee Priya Biddalugaan ||Devara Nee||
Vaasiga Nee Daasulamu Chesina Ee Moral Deesikoni Maa Sakaleshwara Nee Suthuda Yesuni Perita Brovumaamen ||Devara Nee||
116 / 292