COLG Songs

No songs found.

Song 84

జయ సంకేతమా దయాక్షేత్రమా

Jaya sankethama dayaakshethrama

జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య (2) అపురూపము నీ ప్రతి తలపు అలరించిన ఆత్మీయ గెలుపు (2) నడిపించే నీ ప్రేమ పిలుపు ( జయ సంకేతమా )
నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చేనే (2) నన్నెలా ప్రేమించ మనసాయెను నీ మనసెంతో మహోన్నతము కొంతైనా నీ రుణము తీర్చేదెలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా విరిగి నలిగిన మనసుతో నిన్నే సేవించేదా నా యాజమానుడా (2) ( జయ సంకేతమా )
నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే (2) దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా రగిలించే నాలో స్తుతి జ్వాలలు భజియించి నిన్నే కీర్తింతును జీవితగమనం స్థాపించితివి సీయోను చేర నడిపించుమా (2) ( జయ సంకేతమా )
నీ కృప నాయెడల విస్తారమే ఏనాడు తలవని భాగ్యమీది (2) నీ కృప నాకు తోడుండగా నీ సన్నిధియే నాకు నీడాయెను ఘనమైన కార్యములు నీవు చేయగా కొదువేమి లేదాయె నాకెన్నడు ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా (2) ( జయ సంకేతమా )
English lyrics (transliteration)
Jaya sankethama dayaakshethrama Nannu paalinchu naa Yesayya (2) Apuroopamu nee prathi thalapu Alarinchina aathmiya gelupu (2) Nadipinche nee prema pilupu (Jaya sankethama)
Nee prema naalo udayinchagaa Naa koraku sarvamu samakoorchene (2) Nannelaa premincha manasaayenu Nee manasentho mahonnathamu Konthainaa nee runamu theercheddelaa Neevu leka kshanamaina brathikedelaa Virigi naligina manasutho ninne Sevinchedaa naa yaajamaanudaa (2) (Jaya sankethama)
Nilichenu naa madhilo nee vaakyame Naalona roopinche nee roopame (2) Deepamu naalo velinginchagaa Naa aathma deepamu velinginchagaa Ragilinche naalo sthuthi jvaalalu Bhajiyinchi ninne keerdhinthunu Jeevitha gamanam sthaapinchithivi Seeyonu chera nadipinchumaa (2) (Jaya sankethama)
Nee krupa naayedala visthaarame Eenaadu thalavani bhaagyameedhi (2) Nee krupa naaku thodundagaa Nee sannidhiye naaku needaayenu Ghanamaina kaaryamulu neevu cheyagaa Koduvemi ledaaye naakennadu Aathma balamutho nannu nadipinche Naa goppa devudavu neevenayyaa Bahu goppa devudavu neevenayyaa (2) (Jaya sankethama)
98 / 303