COLG Songs

No songs found.

Song 132

నా ప్రాణమా నా సమస్తమా

Naa praanamaa naa samasthamaa

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది
నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా||
పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||
అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటిపాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా||
నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా||
English lyrics (transliteration)
Neeti vaagula koraku duppi aashinchunatlu Nee koraku naa praanamu dappigonuchunnadi
Naa praanamaa naa samasthamaa Prabhuni sthuthiyinchumaa Naa Yesu chesina mellanu neevu maruvakumaa – (2) ||Naa praanamaa||
Panikiraani nanu neevu paiki laepithivi Kreesthani bandapaina nannu nilipithivi (2) Naa adugulu sthiraparachi balamunichhithivi Needu adugu jaadalanae vembadinthu prabhu Nae vembadinthu prabhu ||Naa praanamaa||
Andhakaarapu loyalalo naenu nadachithini Ae apaayamu raakundaa nannu nadipithivi (2) Kantipaapagaa neevu nannu kaachithivi Kanna thandrivi neevani ninnu kolichedhanu Ninnu kolichedhanu ||Naa praanamaa||
Needu aathmatho nindugaa nannu nimpu prabhu Aathma phalamunu dandigaa neekai phaliyinthunu (2) Neevu chesina mellanu naenu etlu marathu prabhu Nee koraku saakshigaa ilalo jeevinthunu Nae ilalo jeevinthunu ||Naa praanamaa||
140 / 303