COLG Songs

No songs found.

Song 123

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము

Naa Brathuku Dinamulu Lekkimpa Nerpumu

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు||
నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||
English lyrics (transliteration)
Naa Brathuku Dinamulu Lekkimpa Nerpumu Devaa Ee Bhuvini Veedu Gadiya Naaku Choopumu Inkontha Kaalamu Aayushshu Penchumu Naa Brathuku Maarchukondunu Samayamunimmu ||Naa Brathuku||
Enno Samvathsaraalu Nannu Daatipovuchunnavi Naa Aashalu Naa Kalalane Vembadinchuchuntini Phalaalu Leni Vrukshamu Vale Edigipothini Enaadu Koolipoduno Erugakuntini Naa Marana Rodana Aalakinchumo Prabhu Marala Nannu Noothanamuga Chiguru Veyani ||Naa Brathuku||
Nee Pilupu Nenu Marachithi – Naa Parugulo Nenalasithi Naa Swaardhamu Naa Paapamu – Pathana Sthithiki Cherchenu Naa Anthametula Nunduno – Bhayamu Puttuchunnadi Devaa Nannu Manninchumu – Naa Brathuku Maarchumu Yesu Nee Chethiki Ika Longipodunu Visheshamugaa Roopinchumu Naa Shesha Jeevitham ||Naa Brathuku||
138 / 296