COLG Songs

No songs found.

Song 107

కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా

Karunaa Sampannudaa Dheerudaa Sukumaarudaa

కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ||2|| నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం ||కరుణా||
1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే - సందడిని చేసెను ||2|| అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను ||2|| ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||
2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని ||2|| నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబందమే అనుదినము మకరందమే - నీ స్నేహబంధము ||2|| ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||
3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది ||2|| నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం ||2|| తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||
English lyrics (transliteration)
Karunaa Sampannudaa Dheerudaa Sukumaarudaa Nee prabhaava mahimalane nirantaram nenu prakatinchedaa ||2|| Naapaina prema choopinchi naa koraku tyaagamaithive Naa Yesayyaa Saatveekudaa Neekosame naa jeevitham ||Karunaa||
Ee naadu nanu veedani – nee prema sandeshamu Naa hrudaya seemalone – sandadini chesenu ||2|| Anuvanuvunu balapariche – nee jeevapu vaakyame Prathi kshanamu daricheri – nanne thaakenu ||2|| Aa vaakyame aarogyamai jeevimpajesi nanne nadipinchenu ||Karunaa||
Ee vintha lokamlo – nee chentha cherithini Enaleni premalone – aadarana pondithini ||2|| Nee krupalo nilipinadi – nee prema bandame Anudinamu makarandame – nee sneha bandhamu ||2|| Aa premalone kadavaraku nannu nadipinchumaa – sthiraparachumaa ||Karunaa||
Ne vechiyunnaanu – nee mahima prathyakshathakai Naakunna ee nireekshanane – sannidhilo nilipinadi ||2|| Naa kosam nirminche – soundarya nagaramulo Pranamilli chesedanu – nee paadaabhivandanam ||2|| Tejomayaa nee shobhitham – ne pondeda koniyaadeda ||Karunaa||
78 / 303