COLG Songs

No songs found.

Song 155

నీ కృపాతిశయమును అనునిత్యము

Nee Krupaathishayamunu Anunithyamu

నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు
1. ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపా ఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపా ఏ మంచితనము - లేకున్ననూ కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకొన్నది నీ కృపా ||నీ కృపా||
2. పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పనిచేయదు ||నీ కృపా||
3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే - కేవలము నీ కృపా మెతుకు బ్రతుకు ఉన్నాయంటే - కేవలము నీ కృపా కృపతోనే రక్షణనిచ్చావు - నా క్రియల వలన కానే కాదు జీవితమంతా ఋణస్థుడను నీయందే నిత్యము అతిశయము ||నీ కృపా||
4. ఇల్లు వాహనం ఉన్నాయంటే - నీదు కృపాదానమే బలము ధనము ఉన్నాయంటే - నీదు కృపా దానమే ఏ అర్హత నాలో లేకున్ననూ - కృపా భిక్షయే నా యెడల జీవితమంతా కృతజ్ఞుడను జీవితమంతా పాడెదను ||నీ కృపా||
5. ప్రియులే నన్ను విడనాడినా - శోకమే నా లోకమా అనాధగానే మిగిలానే - నా కథ ముగిసినదే నీ కుడిచేతిలో ఉంచగనే - బెన్యామీను వంతుగా మారే ఐదంతలాయే నా భాగ్యము విధిరాతనే మార్చెనే నీ కృపా ||నీ కృపా||
English lyrics (transliteration)
Nee Krupaathishayamunu Anunithyamu Nee krupaathishayamunu anunithyamu Ne keerthinchedaa tharatharamulaku Nee vishvaasyathanu ne prachurinthunu
Nee Krupaa Nee Krupaa Aakaashamukante Hechchainadi Mounigaa yetulundedaa saakshigaa prachurinchakaa Naa thudi shwaasa varaku nee chentha cherevaraku
Inkaa brathiki unnaamante – kevalamu nee krupaa Inkaa sevalo unnaamante – kevalamu nee krupaa Ee manchithanamu lekunnaanu konasaaginchinadi Nee krupaa nilabettukonnadi nee krupaa ||Nee Krupaa||
Padi tharamulugaa ventaadina – Moyaabu shaapamu Nee krupanu sharanu vedagaa – maarchene veyyi tharamulu Anyuraalaina aa Roothunu – dhanyuraalugaa maarchinadi Nee krupaye nannu deevinchagaa Ee shaapamu naapai panicheyadu ||Nee Krupaa||
Aarogyam udyogam unnaayante – kevalamu nee krupaa Methuku brathuku unnaayante – kevalamu nee krupaa Krupathone rakshananichchaavu – naa kriyala valana kaane kaadu Jeevithamanthaa runasthudanu Neeyande nithyamu athishayamu ||Nee Krupaa||
Illu vaahanam unnaayante – needu krupaa daaname Balamu dhanamu unnaayante – needu krupaa daaname Ee arhatha naalo lekunnaanu – krupaa bhikshaye naa yedala Jeevithamanthaa kruthagnudanu Jeevithamanthaa paadedanu ||Nee Krupaa||
Priyule nannu vidanaadinaa – shokame naa lokamaa Anaadhagaane migilaane – naa katha mugisinade Nee kudichethilo unchagane – Benyaameenu vanthugaa maare Aidanthalaaye naa bhaagyamu Vidhiraathane maarchene nee krupaa ||Nee Krupaa||
168 / 303