COLG Songs

No songs found.

Song 210

పరలోకమే నా స్వాస్థ్యము

Paralokame Naa Swaasthyamu

పరలోకమే నా స్వాస్థ్యము ఎపుడు గాంతునో (2) నా ప్రియ యేసుని నేనెపుడు గాంతునో (2) ||పరలోకమే||
ఆకలిదప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట (2) పరమ మకుటము పొందను ప్రభు పాదముల చేరెదను (2) ||పరలోకమే||
సిలువ వేయబడితిని ఇక నేకాదు జీవించుట (2) ప్రభు యేసు మహిమ కొరకు గురి గలిగి జీవింతును (2) ||పరలోకమే||
నా పరుగు తుద ముట్టింప నాకు కృపను మెండుగ నొసగును (2) విశ్వాస మార్గములో విసుగక పరుగెత్తెదను (2) ||పరలోకమే||
పరమ విశ్రాంతి పొంద పరలోకమందు చేరెదను (2) పగలు రాత్రచ్చట లేదు ప్రభువే దీపమై యుండును (2) ||పరలోకమే||
ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను (2) దినములు సమీపించగా వాంఛయు అధికంబాయె (2) ||పరలోకమే||
English lyrics (transliteration)
Paralokame Naa Swaasthyamu Epudu Gaanthuno (2) Naa Priya Yesuni Nenepudu Gaanthuno (2) ||Paralokame||
Aakalidappulu Dukhamu Manovedana Ledachchata (2) Parama Makutamu Pondanu Prabhu Paadamula Cheredanu (2) ||Paralokame||
Siluva VeyabaditHini Ika Nekaadu Jeevinchuta (2) Prabhu Yesu Mahima Koraku Guri Galigi Jeevinthunu (2) ||Paralokame||
Naa Parugu Thuda Muttimpa Naaku Krupanu Menduga Nosagunu (2) Vishwaasa Maargamulo Visugaka Parugetthedanu (2) ||Paralokame||
Parama Vishraanthi Ponda Paralokamandu Cheredanu (2) Pagalu Raathrachchata Ledu Prabhuve Deepamai Yundunu (2) ||Paralokame||
Priyuni Pilupunu Vini Nenu Kooda Siddhapadedanu (2) Dinamulu Sameepinchagaa Vaanchayu Adhikambaaye (2) ||Paralokame||
202 / 303