COLG Songs

No songs found.

Song 208

పరవాసిని నే జగమున ప్రభువా

Paravaasini Ne Jagamuna Prabhuvaa

పరవాసిని నే జగమున ప్రభువా (2) నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా (2) నీ దరినే జేరెదను నేను.. నీ దరినే జేరెదను ||పరవాసిని||
లోకమంతా నాదని యెంచి బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2) అంతయు మోసమేగా (2) వ్యర్ధము సర్వమును ఇలలో.. వ్యర్ధము సర్వమును ||పరవాసిని||
ధన సంపదలు గౌరవములు దహించిపోవు నీలోకమున (2) పాపము నిండె జగములో (2) శాపము చేకూర్చుకొనే లోకము.. శాపము చేకూర్చుకొనే ||పరవాసిని||
తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు యెంతో (2) తెలుపుము ఎంత అల్పుడనో (2) విరిగి నలిగియున్నాను నేను.. విరిగి నలిగియున్నాను ||పరవాసిని||
ఆ దినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని (2) క్షమాపణ పొందితివనగా (2) మహానందము కలిగే నాలో.. మహానందము కలిగే ||పరవాసిని||
యాత్రికుడనై ఈ లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో (2) అమూల్యమైన ధనముగా (2) పొందితిని నేను యేసునే.. పొందితిని నేను ||పరవాసిని||
నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియునిలలో (2) చేరుదున్ పరలోక దేశము (2) నాదు గానము ఇదియే నిత్యము.. నాదు గానము ఇదియే ||పరవాసిని||
English lyrics (transliteration)
Paravaasini Ne Jagamuna Prabhuvaa (2) Nadachuchunnaanu Nee Daarin Naa Guri Neeve Naa Prabhuvaa (2) Nee Darine Jeredanu Nenu.. Nee Darine Jeredanu ||Paravaasini||
Lokamanthaa Naadani Yenchi Bandhu Mithrule Priyulanukontini (2) Anthayu Mosamegaa (2) Vyardhamu Sarvamunu Ilalo.. Vyardhamu Sarvamunu ||Paravaasini||
Dhana Sampadalu Gouravamulu Dahinchipovu Neelokamuna (2) Paapamu Ninde Jagamulo (2) Shaapamu Chekoorchukone Lokamu.. Shaapamu Chekoorchukone ||Paravaasini||
Thelupumu Naa Anthamu Naaku Thelupumu Naa Aayuvu Yentho (2) Thelupumu Yentha Alpudano (2) Virigi Naligiyunnaanu Nenu.. Virigi Naligiyunnaanu ||Paravaasini||
Aa Dinamu Prabhu Gurtherigithini Nee Rakthamuche Maarchabadithini (2) Kshamaapana Pondithivanagaa (2) Mahaanandamu Kalige Naalo.. Mahaanandamu Kalige ||Paravaasini||
Yaathrikudanai Ee Lokamulo Siluva Moyuchu Saagedanilalo (2) Amoolyamaina Dhanamugaa (2) Pondithini Nenu Yesune.. Pondithini Nenu ||Paravaasini||
Naa Nethramulu Mooyabadagaa Naadu Yaathra Mugiyunilalo (2) Cherudun Paraloka Deshamu (2) Naadu Gaanamu Idiye Nithyamu.. Naadu Gaanamu Idiye ||Paravaasini||
198 / 296